మడ అడవుల రక్షణ అందరి బాధ్యత

Mar 21,2024 23:56
మడ అడవుల సంరక్షణ

ప్రజాశక్తి – తాళ్లరేవు

మడ అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని ఫారెస్ట్‌ రేంజర్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ వరప్రసాద్‌ అన్నారు. గురువారం ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా కోరంగి హైస్కూల్లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే మడ అడవులు వల్ల లాభాలను విద్యార్థులకు వివరించారు. మడ అడవులను నరకవద్దని వాటిని సంరక్షించడానికి విద్యార్థి దశ నుంచే కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా హైస్కూల్లో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది నాగార్జున, వీరభద్రరావు, గోపీ నాగేంద్రకుమార్‌, మహేష్‌, ధనుంజయ రావు, సుభాని, సంధ్యారాణి , హైస్కూల్‌ హెచ్‌ఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

➡️