మహోన్నత వ్యక్తి కారల్‌ మార్క్స్‌

Mar 15,2024 00:04
మహోన్నత వ్యవక్తి కారల్‌

ప్రజాశక్తి – కాకినాడ, కాకినాడ రూరల్‌

మహోన్నత వ్యవక్తి కారల్‌ మార్క్స్‌ అని సిపిఎం నాయకులు అన్నారు. గురువారం స్థానిక సుందరయ్య భవన్‌లో కారల్‌ మార్క్స్‌ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, సిపిఎం నాయకులు, కార్య కర్తలు మార్క్స్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రపంచ కార్మికు లారా ఏకంకండు, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అనే పిలుపును మార్క్స్‌ ఆనాడే ఇచ్చారని తెలిపారు. మార్క్స్‌ రాసిన పెట్టుబడి పుస్తకం ఇప్పటికి ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. సోషలిస్టు సమాజమే ప్రజలందరి సమస్యలు తీర ుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపి ఎం నాయకులు కెఎస్‌.శ్రీనివాస్‌, కె.వీర బాబు, టి.ఈశ్వరరావు, కె.సింహాచలం, టి.రాజా, ఎం.జి.సూరిబాబు పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ బోటు క్లబ్‌ వాకర్స్‌ సంఘం ఆధ్వర్యంలో కార్ల్‌ మార్క్స్‌ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ మార్క్స్‌ ఆలోచనలు, సిద్ధాం తాలు వాటి తదుపరి అభివృద్ధి సమిష్టిగా మార్క్సిజం అని పిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్‌, రవిశంకర్‌ పట్నాయక్‌, శిరీష, వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు.

➡️