మార్చి 1న చలో కలెక్టరేట్‌

Feb 25,2024 23:25
భవన నిర్మాణ కార్మికుల

ప్రజాశక్తి – కోటనందూరు

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 1న జరిగే చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని ఎపి వర్కర్స్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌కె.పద్మ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో స్థానికంగా జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించాలని, 1214 మెమోని తక్షణం రద్దు చేయాలని, 2019 నుంచి పెండింగ్లో పెట్టిన క్లైముల పరిహారాలను కార్మికులకు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం చలో భవన కార్మికుల చలో కలెక్టరేట్‌ ప్రసార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భవన కార్మికులు వాయలేటి అప్పారావు, జక్కిలింకి రాముడు, బాబురావు, నూకరాజు ,సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️