‘మెడికవర్‌’లో అరుదైన శస్త్ర చికిత్స

Mar 9,2024 23:28
మెడికవర్‌ హాస్పిటల్లో

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

మెడికవర్‌ హాస్పిటల్లో మోడ్రన్‌ టెక్నాలజీ ఉపయోగించి ఎలాంటి కోత లేకుండా 5 ఏళ్ళ చిన్నారికి గుండె ఆపరేషన్‌ను విజ యవంతంగా నిర్వహించినట్లు పిడి యాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అల్లూరి అశోక్‌రాజు, డాక్టర్‌ మాతా శ్రీనివాస్‌, డాక్టర్‌ పి.ప్రణవ్‌, డాక్టర్‌ నరేష్‌, క్లస్టర్‌ హెడ్‌ సిద్ద రెడ్డి తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో శని వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం గ్రామానికి చిందిన 5 ఏండ్ల సౌమ్యకి పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధి ఉందన్నారు. తమ ఆసుపత్రికి వచ్చిన ఆ చిన్నారికి ఆరోగ్యశ్రీ పథకంలో డివైస్‌ క్లోజర్‌ ప్రొసీజర్‌ ద్వారా ఆ చిన్నా రికి గుండెకు శస్త్రచికిత్స నిర్వహించి విజయ వంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఆసుపత్రిలో పెద్దవారికి మాత్రమే గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించామని, ప్రస్తుతం చిన్నారులకు కూడా ఆధునిక పరిజ్ఞానంతో కుట్టు, కోత లేకుండా గుండె శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కాకినాడకు చెందిన 5 ఏళ్ల ఆడ శిశువుకు గుండెలో ఏట్రియాల్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ అనే పెద్ద రంధ్రం ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఆ చిన్నారికి ఆధునిక డివైస్‌ క్లోజర్‌ ప్రొసీజర్‌ ద్వారా విజయవంతంగా గుండె శస్త్ర చికిత్సలను నిర్వహించడం జరిగిందన్నారు. పదేళ్ల లోపు వయసు కలిగిన వీరు శస్త్ర చికిత్స జరిగిన రెేండు రోజుల్లో కోలుకుని నడవడం జరిగిందన్నారు సాధారణంగా హార్ట్‌ సర్జరీ జరిగిన పిమ్మట సంవత్సరం వరకు ఎవరు కోరుకోలేరని, ఇప్పుడు కొత్త విధానం ద్వారా కేవలం రెండు రోజుల్లో మనిషి కోలుకుని నడవడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీలో చిన్న పిల్లల గుండె శస్త్ర చికిత్సల వైద్య సౌకర్యం ఉందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. తమ బిడ్డకు పునర్జన్మనిచ్చిన మెడికోవర్‌ వైద్యులకు సౌమ్య తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

➡️