సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె తప్పదు

Mar 4,2024 23:30
తమ సమస్యలను

ప్రజాశక్తి – కాకినాడ

తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విఠల్‌ను సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, యూనియన్‌ అధ్యక్షులు సిహెచ్‌.విజరుకుమార్‌ కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించామని, ఐనా అధికారుల్లో కానీ, సంబంధిత కాంట్రాక్టర్‌ నుంచి కాని స్పందన రాలేదన్నారు. తమకు వేరే గత్యంతరం లేదని, సమ్మెలోకి వెళ్తామని వారు ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ఆయన ఆసుపత్రి సిఎస్‌ఆర్‌ఎంఒ, ఎడిలను పిలిపించి తక్షణమే కాంట్రాక్టర్‌ని రప్పించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తొలుత ఆసుపత్రి మాతా శిశు విభాగం వద్ద నుంచి ఒపి విభాగం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ, యూనియన్‌ నాయకులు జె.శేషు, ఆర్‌.రమేష్‌, ఎస్‌. వాసు, బి.మంగతాయారు, కృష్ణవేణి, తలుపులమ్మ, చంద్రకళ, కుమారి, అరుణ, రవి, శ్రీకాంత్‌, వసంత్‌, కోటి, కామేశ్వరి, భాగ్యవతి, శ్రీనివాస్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️