సమస్యల పరిష్కారంలో ముందుండాలి

Ganababu meeting with party cadre

ప్రజాశక్తి- గోపాలపట్నం : సమస్యల పరిష్కారంలో ముందుండాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు చెప్పారు. స్థానిక ధనుష్‌ కల్యాణ మండపంలో 89, 90 92 వార్డుల కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన విజయంలో కీలక భూమిక పోషించిన బూత్‌ స్థాయి నాయకులకు, యూనిట్‌ ఇన్‌ఛార్జిలకు, వార్డు నాయకులకు, జనసేన, బిజెపి నాయకులకు, మహిళలకు, కార్యకర్తలకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేరుగా గాని, ఆఫీసులో తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అంగా దుర్గప్రశాంతి, 89వ వార్డు టిడిపి కార్పొరేటర్‌ దాడి వెంకట రమేష్‌, 90వ వార్డు కార్పొరేటర్‌ బొమ్మిది రమణ పాల్గొన్నారు.

➡️