సినీ నటి అమృత సందడి

Mar 30,2024 16:50
కాకినాడ నగరంలో సినీ నటి

ప్రజాశక్తి – కాకినాడ

కాకినాడ నగరంలో సినీ నటి అమృత అయ్యర్‌ సందడి చేశారు. శనివారం కాకినాడలోని దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్‌ జ్యువెలరీ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఆ బంగారు నగల దుకాణాన్ని సుమారు గంటపాటు పరిశీలించి నగలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. సినీ నటి అమృత రాక సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ సమస్య లేకుండా క్రమబద్దీకరించారు. ఆమెకు సిఎంఆర్‌ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది. అమృత అయ్యర్‌ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన హనుమాన్‌ చిత్రంలో కథానాయకగా నటించింది. అమృతను చూసేందుకు పలువురు ఎగబడ్డారు.

➡️