10వ రోజు జిజిహెచ్‌ వర్కర్స్‌ ఆందోళన

Feb 10,2024 22:29
10వ రోజు జిజిహెచ్‌ వర్కర్స్‌ ఆందోళన

ప్రజాశక్తి-కాకినాడతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన శనివారం 10వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షుడు సిహెచ్‌.విజరు కుమార్‌, కామేశ్వరి మాట్లాడుతూ కాంట్రాక్టు సంస్థ తమతో చర్చలు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్స్‌ అన్నీ పరిష్కారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 24 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా యజమానులు చెల్లించాల్సిన పిఎఫ్‌, ఇఎస్‌ఐ కూడా తమ జీతాలు నుండి కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు విపరీతంగా పెరగడం వల్ల జీతాలు సరిపోవడం లేదన్నారు. బుధవారం నుండి ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, ఆర్‌.రమేష్‌, వివిఎన్‌ కుమార్‌, దుర్గాప్రసాద్‌, చంద్రకళ, కుమారి, అరుణ, తలుపులమ్మ, మంగ, బి.శ్రీకాంత్‌, ఎం.రవి, శ్రీనివాస్‌, జనార్ధన్‌, కోటి, ఏసు, నరేంద్ర పాల్గొన్నారు.

➡️