11న ఫూలే జయంతి

Apr 8,2024 23:49
ఈనెల 11న స్థానిక

ప్రజాశక్తి – తాళ్లరేవు

ఈనెల 11న స్థానిక ప్రజా సంఘాల భవనంలో నిర్వహించే మహాత్మ పూలే జయంతిని విజయవంతం చేయాలని విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు ఏడు కొండలు, మండల ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ టేకు మూడి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. పూలే జయంతి సంద ర్భంగా ముద్రించిన కరపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రజాసంఘాల భవనంలో జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్య క్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, అంబేడ్కర్‌, పూలే అభిమానులు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.

➡️