28న రత్నగిరిపై ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన

Mar 4,2024 23:31
అన్నవరం సత్యనారాయణ

ప్రజాశక్తి – అన్నవరం

అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇఒ కె.రామచంద్రమోహన్‌ తెలిపారు. సోమ వారం ఇంజనీరింగ్‌ అధికారులు ప్రధాన ఆలయం వద్ద ఉన్న పరిస్థితులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ దాత అశోక్‌ కుమార్‌ రెడ్డి సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో దేవతా వృక్షానికి సంబంధించిన ధ్వజస్తంభానికి బంగారు తాపడం తయారుచేసి అందించేం దుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ ధ్వజ స్తంభాన్ని పాత ధ్వజ స్తంభం స్థానంలో ప్రతిష్ట చేసేందుకు గల సాధ్య సాధ్యాలను ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించారని చెప్పారు. వైదిక కమిటీ సూచనలు మేరకు ఈనెల 28న పాత ధ్వజస్తంభాన్ని తొలగించడానికి సంప్రోక్షణ కార్యక్రమం, వైదిక పూజలు అనంతరం ఈ నూతన ద్వజ స్తంభాన్ని పునఃప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో దేవదాయ శాఖ జోనల్‌ సిఇ జివిఆర్‌.శేఖర్‌, శిల్పి శ్రీనివాసచారి, దేవస్థానం డిప్యూటీ ఇంజనీర్‌ ఉదరు కుమార్‌ పాల్గొన్నారు.

➡️