సైబర్‌ భద్రతపై నృత్య ప్రదర్శన

Apr 8,2024 23:48
ప్రజల్లో సైబర్‌

ప్రజాశక్తి – సామర్లకోట

ప్రజల్లో సైబర్‌ భద్రతపై నృత్య ప్రదర్శన ద్వారా అవగాహన కార్య క్రమాన్ని నిర్వహించారు. సోమవారం సామర్లకోట – అచ్చంపేట ఎడిబి రోడ్‌లో లక్ష్య ఇంటర్నేషనల్‌ పాఠ శాలలో జరిగిన ఈ అవ గాహన కార్యక్రమంలో విద్యార్థులు ఫ్లాష్‌ మాబ్‌ నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ప్రజలం దరూ సైబర్‌ నేరాల గురిం చి తెలుసుకోవాలని, ఫోన్‌లలో తెలియని లింకులను క్లిక్‌ చేయడం, తెలియని ఆప్స్‌ డౌన్‌లోడ్‌ చేయడం కారణంగా ప్రమాద పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాలను నృత్య రూపకంలో వివరించారు. వ్యక్తి గత సమాచారం, బ్యాంకు వివరాలు రహస్య సమాచారం సైబర్‌ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతాయనే విషయాన్ని తెలియజేశారు. మహిళలు అనేక మంది ఈ సైబర్‌ నేరాలకు బలి అవుతున్నారని విద్యార్థులు తమ నృత్య ప్రదర్శన ద్వారా తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ వందనా బోహ్రా, వైస్‌ ప్రిన్సిపల్‌ హేమ, ఉపాధ్యాయినీ, ఉపాధ్యా యులు, విద్యార్థులు, వారి తల్లీదండ్రులు పాల్గొన్నారు.

➡️