నియమావళి ప్రకారమే లెక్కింపు ప్రక్రియ

May 23,2024 22:31
ఎన్నికల కమిషన్‌ మార్గ

ప్రజాశక్తి – కాకినాడ

ఎన్నికల కమిషన్‌ మార్గ దర్శకాల ప్రకారం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నామని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె. నివాస్‌ అన్నారు. గురువారం రాష్ట్ర ఎన్ని కల కమిషనర్‌ ముఖేష్‌కుమార్‌మీనా విజయవాడ నుంచి అన్ని జిల్లాల ఎన్ని కల అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి పిఠాపురం నియోజకవర్గ ఆర్‌ఒ ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డితో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా జూన్‌ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, సిబ్బందికి శిక్షణ, కంట్రోల్‌ రూమ్‌, మీడియా సెంటర్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కింపు, స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రత, నిఘా వ్యవస్థ, కౌంటింగ్‌ కేంద్రాల్లో కావలసిన ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సిఇఒ ముఖేష్‌ కుమార్‌ మీనా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్‌ మాట్లా డుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరిం చారు. స్ట్రాంగ్‌ రూములు వద్ద భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మూడు అంచెల భద్రత, సిసి టివి కెమెరాలతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశామని, జూన్‌ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఓట్ల లెక్కింపు కార్య క్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు కంట్రోల్‌ రూమ్‌, మీడియా సెంటర్‌, ఫెన్సింగ్‌, బారి కేడ్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ డాక్టర్‌ డి.తిప్పే నాయక్‌, తుని, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్‌, కాకినాడ పట్టణం, జగ్గంపేట నియోజకవర్గాల ఆర్‌ఒలు, సిపిఒ పి.త్రినాథ్‌, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

➡️