పింఛన్లను డిబిటితోపాటు, ఇంటింటికి పంపిణీ

Apr 29,2024 23:07
ప్రతి నెలా పంపిణీ చేస్తున్న

ప్రజాశక్తి – కాకినాడ

ప్రతి నెలా పంపిణీ చేస్తున్న సామాజిక భద్రత పింఛన్లను మే, జూన్‌ నెలలో డిబిటి (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌)తోపాటు, ఇంటింటికి పంపిణీ కూడా చేయడం జరుగుతుందని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో పింఛన్ల పంపిణీపై అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రానున్న మే, జూన్‌ నెలలో సామాజిక భద్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్లు డిబిటి విధానంతోపాటు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 2,80,662 పింఛన్‌దారులలో 2,13,195 మందికి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్‌ సొమ్ము జమ చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన 67,467 మంది దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వివిధ ఆరోగ్య కారణాలతో మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్దనే అందచేస్తామన్నారు. లబ్ధిదారులు ఎవరు పింఛన్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఈమేరకు ఎవరికి ఏ విధంగా పింఛన్‌ పంపిణీ చేయాలనే అంశంపై గ్రామ, వార్డు సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని వివరించారు. కాకినాడ పార్లమెంటురీ నియోజకవర్గానికి సంబంధించి 18 మంది అభ్యర్థుల నామి నేషన్లు పరిశీలనలో వాలిడ్‌గా నిలిచాయని, సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిందన్నారు. అదేవిధంగా జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బంది అందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు విని యోగించుకునేలా మే నెల 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు పెసిలిటేసన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం జరుగుతుం దని తెలిపారు అదేవిధంగా 7, 8 తేదీల్లో కాకినాడ జిల్లాలో పనిచేస్తూ వేరే జిల్లాలో ఓటు ఉన్నవారికి అవకాశం కల్పిం చడం జరుగుతుందిని వివరించారు. ఓటు హక్కు ప్రాము ఖ్యత, ఓటర్లను చైతన్య పరుస్తూ ఆడియో, వీడియోల రూ పంలో సందేశాలు, పాటలు రూపొందించడం జరిగిందని జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ డాక్టర్‌ డి.తిప్పే నాయక్‌, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, డిపిఆర్‌ఒ డి.నాగార్జన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️