వేసవిలో మంచినీరు అధికంగా తీసుకోవాలి

Apr 23,2024 22:38
వేసవిలో డీహైడ్రేషన్‌ వలన

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

వేసవిలో డీహైడ్రేషన్‌ వలన సంభవించే అనేక అనారోగ్య పరిస్థితుల నుంచి కాపాడు కోవడానికి దాహం వేసినా వేయక పోయినా తరచూ ఎంతో కొంత పరి మాణంలో మంచినీరు తాగా లని ఫార్మాసిస్టు శ్రీవాణి సూచిం చారు. మంగళవారం బోటు క్లబ్‌ వాకర్స్‌ సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వేసవి కాలంలో చమట రూపంలో శరీరం నుంచి చాలా నీరు బయటకు వెళుతుందన్నారు .ఈ నీటిని భర్తీ చేయకపోతే శరీరం వేడెక్కి విపరీతమైన అలసట, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందన్నారు. జీర్ణక్రియ ప్రక్రియకు మంచినీరు తోడ్పడుతుందని అన్నారు. మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు కూడా తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్‌, సి. శ్రీనివాసరావు, రాజా పాల్గొన్నారు.

➡️