అధ్యాపకులకు పరిశోధనలు అవసరం

May 6,2024 23:10
అధ్యాపకులకు పరిశోధనలు

ప్రజాశక్తి – గండేపల్లి

అధ్యాపకులకు పరిశోధనలు అవ సరమని ఆదిత్య యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆదిత్య కాలేజీ అఫ్‌ ఇంజనీరింగ్‌లో పరిశోధన పత్రాలు ప్రచురించడంపై 5 రోజుల సదస్సు ప్రారంభమయ్యింది. మెకానికల్‌ ఇంజ నీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ అధ్యాపకు లందరికి పరిశోధన అవసరమని, అందరూ పరిశోధన పత్రాలను రూపొందించడంలో సుశిక్షుతులు కావాలని పిలుపునిచ్చారు. కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఆదిరెడ్డి రమేష్‌ మాట్లాడుతూ ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి మేటి పరి శోధకులతో, పరిశోధన చేసే అధ్యాపకుల కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సంజరు మాట్లాడుతూ ఒకసారి ఏ విషయం మీదైనా ప్రయోగం చేసిన తర్వాత కనీసం 4 లేదా 5 పరిశోధనా పత్రాలను సులభంగా ప్రచు రించవచ్చుని తెలిపారు. పరిశోధనా విభాగం డీన్‌ డాక్టర్‌ కెవిఎస్‌ఆర్‌.మూర్తి మాట్లాడుతూ ఒక అధ్యాపకుడు మానవ మెదడుపై పరిశోధన చేస్తున్నారని సదస్సు దృష్టికి తెచ్చారు. మెకానికల్‌ విభాగం అధిపతి డాక్టర్‌ వైకెఎస్‌.సుబ్బారావు వెబ్‌ అఫ్‌ సైన్స్‌, స్కోపస్‌ డేటాబేస్‌ల ఉపయోగం మరియు వాటి విశిష్టతను వివరించారు. ఈ సదస్సులో తాడేపల్లిగూడెం నిట్‌ బిట్స్‌ పిలానీ, మేఘాలయకు చెందిన నిట్‌, కలశలింగం యూని వర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీలకఉ చెందిన మేటి పరిశోధకులు, ప్రొఫెసర్లు వివిధ అంశాలపై కూలంకుషంగా వివరించనున్నారని సదస్సు సమన్వయకర్త డాక్టర్‌ రాహుల్‌ భారతి వెల్లడించారు.

➡️