సమర్థవంతంగా ఎన్నికల విధులు

Apr 30,2024 23:16
రానున్న ఎన్నికలను

ప్రజాశక్తి – కాకినాడ

రానున్న ఎన్నికలను సమర్థవంతంగా, సజావుగా నిర్వ హించడంలో విధుల్లో ఉన్న సిబ్బంది పాత్ర అత్యంత కీలక మని కాకినాడ అర్బన్‌ ఆర్‌ఒ జె..వెంకటరావు తెలిపారు. మంగళవారం స్థానిక పిఆర్‌ ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఒపిఒలకు ఎన్నికల విధులపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఎన్నికల విధుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇవిఎం, వివి ప్యాట్ల నిర్వహణ సహా వివిధ అంశాలపై మాస్టర్‌ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఎన్నికలకు ముందు రోజు, ఎన్నిక జరిగే రోజున తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై ఒపిఒలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఒ వెంకటరావు మాట్లా డుతూ విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎటువంటి లోటుపాట్లకు ఆస్కా రం లేకుండా విధులు నిర్వర్తించి ఎన్నికలు సజావుగా నిర్వహిం చడంలో క్రియాశీలకంగా వ్యవ హరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ గుంటూరు శేఖర్‌, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

➡️