గ్రామాల్లో ఎన్నికల కోలాహలం..

Apr 11,2024 23:38
జిల్లాలోని పలు

ప్రజాశక్తి – యంత్రాంగం

జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసిపి, టిడిపి, జనసేన పార్టీల అభ్యర్థులు గురువారం ఎన్నికల ప్రచారాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఇంటింటా తిరిగి ఓటర్లను అభ్యర్థించారు.

కాకినాడ స్థానిక 30వ డివిజన్‌లోని మెయిన్‌ రోడ్డు, గోల్డ్‌ మార్కెట్‌ సెంటర్‌, మసీద్‌ సెంటర్‌ తదితర ప్రాంతాల్లో టిడిపి అర్బన్‌ నియోజకవర్గ అభ్యర్థి వనమాడి కొండబాబు పర్యటించి సూపర్‌ సిక్స్‌ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి ఓటును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మాజీ మేయర్‌ సుంకర పావని తిరుమల కుమార్‌, నాయకులు గ్రంధి నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలోని 16, 17 వార్డుల్లో మాజీ ఎంఎల్‌ఎ ఎన్‌విఎస్‌ఎస్‌.వర్మ పవన్‌ కల్యాణ్‌ గెలుపుకోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్‌, దుర్గాడ విజయలక్ష్మి, సత్తిబాబు, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

రౌతులపూడి మండలంలోని అచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ప్రతిపాడు వైసిపి అభ్యర్థి వరుపుల సుబ్బారావు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వాసిరెడ్డి జమీలు, తాతాజీ, తిరుమల రాయలు, శర్నం శ్రీను, తదిరులు పాల్గొన్నారు.

పెద్దాపురం మండలంలోని సిరివాడ గ్రామంలో ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరి బాబు రాజు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ తుమ్మల రామ స్వామి, బిజెపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ విత్తనాల వెంకట రమణ, నిమ్మకాయల రంగనాగ్‌, కొత్తిం వెంకట శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. అలాగే జె.తిమ్మా పురంలో రాజప్ప నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గ్రామానికి చెందిన పలువురు టిడిపిలో చేరారు. ఈ కార్య క్రమంలో ఇ.సుబ్బారావు, మల్లిపూడి రామచంద్ర ప్రసాద్‌, కందుల విశ్వేశ్వరరావు, మీనవల్లి శ్రీనివాస్‌, ఎన్నం రామన్న చౌదరి, బులి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సామర్లకోట పట్టణ శివారు యానాదుల కాలనీ చెందిన మాజీ కౌన్సిలర్‌ పంతాడి ధనరాజు తోపాటు పలువురు కాలనీ ప్రజ లు టిడిపిలో చేరారు. ఇటీవల కాలంలోనే పంతాడి ధనరాజు వైసిపిలో చేరారు. తిరిగి ఆయన టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంఎల్‌ఎ చినరాజప్ప పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని 28, 29, 30 వార్డుల్లో వైసిపి పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి దవులూరి దొరబాబు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గంగిరెడ్డి అరుణ, మున్సి పల్‌ వైస్‌ చైర్మన్‌ ఊబా జాన్‌ మోజేసు, వార్డు కౌన్సిలర్‌, ఇతర నాయకలు పాల్గొన్నారు. అలాగే వేట్లపాలెం శివారు దోమా డుపాకల గ్రామంలో ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు ఆధ్వర్యంలో దవులూరి దొరబాబు సతీమణి చంద్రకళ, కుమా ర్తె సార్విక, రాష్ట్ర బిసి అయ్యర్క కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఆవాల రాజేశ్వరి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే మండలంలోని జి.మెడపాడు గ్రామంలో తెలుగు రైతు కాకినాడ పార్లమెంట్‌ అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు చౌదరి( శ్రీనుబాబు) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు పాల్గొన్నారు. కిర్లంపూడి మండలంలోని ముక్కొల్లు గ్రామంలో టిడిపి జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కుమార్తె తోట సునీత ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బస్వా వీరబాబు, తోట సర్వారాయుడు, సర్పంచ్‌ జ్యోతుల రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ రూరల్‌ రూరల్‌ మండలంలోని సర్పవరం గ్రామం లో జనసేన పార్టీల అభ్యర్థులు పంతం నానాజీ, తంగెళ్ల ఉదరు శ్రీనివాస్‌ను గెలిపించాలని టిడిపి నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి, అభ్యర్థి పంతం నానాజీ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జగ్గంపేట టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ జగ్గం పేటలోని అంబేద్కర్‌ కాలనీలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌విఎస్‌.అప్పలరాజు, మారి శెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి పాల్గొన్నారు.

తాళ్లరేవు మండలంలోని తాళ్ళరేవు గ్రామంలో టిడిపి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుత్తుల సాయి, గంగ సూర్యనారాయణ, దూలిపూడి వెంకట రమణ, పొన్నమండ రామలక్ష్మి, వాసంశెట్టి శ్రీనివాస్‌ పాల్గొ న్నారు.

ఏలేశ్వరం స్థానిక ఆర్‌టిసి కాలనీలో టిడిపి ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి వరుపుల సత్యప్రభ విజయం కోసం ఆమె తనయుడు సాయి తర్షిత్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మూది నారాయణ స్వామి, బొదిరెడ్డి గోపి, అలమండ వీరరాఘవస్వామి, సూతి బూరయ్య, తదితరులుపాల్గొన్నారు.

➡️