జనసేన జిల్లా అధ్యక్షుడికి ఘన సత్కారం

Apr 10,2024 23:47
జనసేన పార్టీ కాకినాడ

ప్రజాశక్తి – సామర్లకోట

జనసేన పార్టీ కాకినాడ జిల్లాకు అధ్యక్షుడిగా నూతనంగా ఎంపికైన తుమ్మల రామస్వామిని అభిమానులు ఘనంగా సత్కరిం చారు. బుధవారం స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్‌ హాల్లో జరిగిన సత్కార సభ టిడిపి పెద్దాపురం నియోజక వర్గ అభ్యర్తి, ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ నూతనంగా జిల్లాలో ఎంపీ స్థానంతోపాటు, ఏడు ఎంఎల్‌ఎ స్థానాలను కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కూటమి విజయం తథ్యమని ఇప్పటికే సర్వేలు స్పష్టంగా చేబుతున్నాయని అన్నారు. పార్టీ పక్షాన పోటీ చేయాలని భావించిన ఆశావహుల్లో కొందరికి టిక్కెట్టు దక్కక పోవడంతో పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌పై నిందలు వేయ డం సరికాదన్నారు. త్వరలోనే వారి తప్పులు తెలుసుకుని తిరిగి పార్టీలోకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామస్వామిని జనసేన, టిడిపి, బిజెపి నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు నిమ్మకాయల రంగనాగ్‌, సరోజ, మంచెం సాయి, అడబాల కుమారస్వామి, కంటే జగదీశ్‌, రాజా సూరిబాబు రాజు, వల్లూరి దొర, తదితరులు పాల్గొన్నారు.

➡️