ఈవీఎం స్ట్రాంగ్ రూముల పరిశీలన

May 25,2024 16:06 #Kakinada

 పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్

ప్రజాశక్తి-కాకినాడ : స్ట్రాంగ్ రూము పరిశీలనకు వచ్చిన అభ్యర్థులు, ఏజెంట్లు వివరాలు లాగ్ రిజిస్టర్ లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.
కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత, నిఘా వ్యవస్థను శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. డా.బిఆర్.అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లాగ్ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో సురక్షితంగా భద్రపరిచడం జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత, నిఘా వ్యవస్థను పరిశీలించేందుకు రెండు మూడు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజేంట్లును తీసుకువెళ్లడం జరుగుతుందని, స్ట్రాంగ్ రూముల పరిశీలను వచ్చే వారి వివరాలు తప్పనిసరిగా లాగ్ రిజిస్టర్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️