ఇళ్లకు వెళ్లే దారేది..?

May 23,2024 22:32
ఉన్నఫళంగా

ప్రజాశక్తి – సామర్లకోట

ఉన్నఫళంగా డివైడర్‌ దారులు ముసివేస్తే తమ వీధుల్లోకి ఎలా వెళ్లేది? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోని పెద్దా పురం మెయిన్‌ రోడ్డులో ప్రసన్నఆంజనేయ స్వా మి ఆలయం మొదలు విఘ్నేశ్వర థియేటర్‌ వరకూ ప్రధాన రహదారిలో వన్‌ వే అమలుకు రహదారుల మధ్య డివైడర్‌లను ఆర్‌ అండ్‌ బి అధికారులు ఏర్పాటు చేశారు. అయితే లారీ స్టాండ్‌ రోడ్డు మొదలు విఘ్నేశ్వర థియేటర్‌ వరకూ గణపతి నగరం, అయోధ్య రామపురం ప్రాంతాలకు వెళ్లే ప్రజల కోసం సుమారు 15 లింకు రోడ్డులున్నాయి. వాటికి సంబంధించి మెయిన్‌ రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్‌లకు ద్విచక్ర వాహనాలు రాకపోకలు జరిపేందుకు మార్గాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ మార్గాలకు అడ్డుగా టైర్‌ లు ఏర్పాటు చేసి, తాళ్ళు కట్టి ఎవరూ వెళ్లకుండా పూర్తిగా మూసివేశారు. దీంతో మెయిన్‌ రోడ్డు నుంచి గణపతి నగరం, అయోధ్య రామపురం ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రజలు ఇటు మెహర్‌ కాంప్లెక్స్‌ వరకూ వచ్చిగాని, లేదంటే విఘ్నేశ్వర థియేటర్‌ వరకూ వెల్లిగానీ మలుపు తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఈ కారణంగా తమకు సమయంతోపాటు తమ వాహనాలకు ఆయిల్‌ వృధా అవుతుందని వాపోతున్నారు. వీధులు ఉన్న చోట డివైడర్‌ కట్టింగ్‌లను ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారని, ఇలా వాటిని మూసివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

➡️