అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యం తగదు

Dec 17,2023 16:52 #Kakinada
kkd aganwadi workers strike 6th day kajuluru

ప్రజాశక్తి-కాజులూరు : అంగన్వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగ్గదని జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి వల్లు రాజబాబు అన్నారు. సమస్యల పరిష్కారం కొరకు అంగనవాడి సమ్మెలో భాగంగా ఆదివారం మండల కేంద్రమైన కాజులూరు పంచాయతీ వద్ద ఆరవ రోజుకు చేరిన సమ్మెను ఉద్దేశించి ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లి రాజబాబు మాట్లాడుతూ అంగన్వాడిల సమస్యల పరిష్కరించకుండా ప్రభుత్వం కవ్వింపు చర్యలకు దిగటం చాలా దుర్మార్గమని అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కనీస వేతనం పెంచే వరకు ఈ నిరసన కొనసాగించాలని సంఘం పిలుపుకు అంగన్వాడీలంతా సిద్ధంగా ఉండాలని ఐక్యంగా ప్రభుత్వ తీరును నిరసించాలని ఒకసారి చర్చలు జరిగినప్పటికీ ప్రభుత్వం దిగిరాని కారణంగా సమ్మె ఇంకా కొనసాగించాలని అనేక రూపాల్లో దశల వారి ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లపాలెం కాజులూరు కోలంక సెక్టార్ లీడర్లు వరలక్ష్మి, హనుమామతి, అన్నవరం, మామిడి ప్రసన్న, జొన్నలగడ్డ సరోజినీ, సలాది లక్ష్మి, నందికోళ్ల నాగమణి,శేషారత్నం తదితరులు పాల్గొన్నారు.

➡️