మహిళాభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే..

Apr 9,2024 23:19
రాష్ట్రంలో మహిళల

ప్రజాశక్తి- సామర్లకోట

రాష్ట్రంలో మహిళల సంక్షే మం అభ్యున్నతి ఒక కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం స్థా నిక చిన్నవీధిలో సానిపిని సంధ్యారాణి ఆధ్వర్యంలో పలువురు మహిళలు టిడిపి లో చేరారు. వీరికి చినరాజప్ప జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ తుమ్మల బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ సదర్భంగా రాజప్ప మా ట్లాడుతూ అన్ని వర్గాలను ఘోరంగా మో సగించి ప్రజలపై మోయ లేని భారాలు మోపిన జగన్‌ రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, కార్యదర్శి బడు గు శ్రీకాంత్‌, రైతు సంఘం నాయకులు కంటే జగదీష్‌ మోహన్‌బాబు, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోలి వెంకట అప్పారావుచౌదరి, కౌన్సిలర్‌ బి.వాసు, ఎస్‌.గోపి, బి.రామలక్ష్మి పాల్గొన్నారు.

➡️