ఆడపిల్ల దేశానికి గర్వకారణం

Jan 24,2024 16:27 #Kakinada
national girl chidren day by jvv

ఆనాల వీరభద్రరావు

ప్రజాశక్తి – యానాం : స్థానిక కమలా నెహ్రూ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని కె ఎన్ లక్ష్మీ అధ్యక్షతన జాతీయ బాలిక దినోత్సవాన్ని జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక యానాం కమిటీ అధ్యక్షుడు ఆనాల వీరభద్రరావు మాట్లాడుతూ ఆడపిల్ల దేశానికి గర్వకారణమని, బాలికలు అందరూ ఇష్టపడి చదివి, ప్రభుత్వ అవకాశాలను ఉపయోగించుకుని అభివృద్ధిలోకి రావాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయిని కె ఎన్ లక్ష్మి మాట్లాడుతూ మొదటి దేశ మహిళా ప్రధాని ఇందిరా గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు జనవరి 24 నుండి జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవము జరుపుకుంటున్నామన్నారు. అనంతరం ఆడపిల్ల దేశానికి గర్వకారణం అను స్టిక్కర్ ఆవిష్కరించారు. “ఐ యాం నేషన్స్ ప్రైడ్” అను బ్యాడ్జీలను విద్యార్థినిలకు అలంకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జె వి వి నాయకుడు కెవివి సత్యనారాయణ, కే.ఎస్వీ.లక్ష్మి, గిరిజాదేవి, వి.పి.ఎస్.ఎం.మంజరి తదితరులు పాల్గొన్నారు.

➡️