మ్యాజిక్‌ షో ద్వారా శాస్త్రీయ అవగాహన

May 18,2024 17:14
స్థానిక యాసలపు

ప్రజాశక్తి – పెద్దాపురం

స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంప్‌లో శనివారం జనవిజ్ఞాన వేదిక సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ జిల్లా కన్వీనర్‌ బుద్దా శ్రీనివాస్‌ మ్యాజిక్‌ షో ద్వారా శాస్త్రీయ దృక్పథంపై బాలలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిమల పేరుతో అనేకమంది ప్రజలను మోసం చేస్తుంటారని, శాస్త్రీయ ఆలోచన విధానం ద్వారా మోసాలను బహిర్గతం చేసి వాస్తవాలు తెలుసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్క అంశము శాస్త్రీయతతో ముడిపడి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి మ్యాజిక్‌ అంశాన్ని దాని వెనకనున్న వాస్తవాన్ని బాలలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ శిబిరంలో దుంగల పూజితా సూర్యశ్రీ కరాటే లో శిక్షణ ఇచ్చారు. నీలపాల కృష్ణ కర్రసాములో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్‌ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్‌ కుమార్‌, మంజుల, అమృత, సాయి, బంగారం, మణికంఠ, నేహా, రేణుక, శ్రీజ, కె.రవి, కె.పవన్‌ తదితరులు సేవలందించారు.

➡️