విద్యారంగాన్ని కాపాడాలి : ఎస్ఎఫ్ఐ

Jan 31,2024 17:55 #Kakinada
sfi rally

నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి
చలో చెన్నై జయప్రదం చేయండి
ప్రజాశక్తి-కాకినాడ : విద్యారంగాన్ని కాపాడాలని, నూతన జాతియ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఫిబ్రవరి 1న జరుగుతున్న విద్యార్థుల లాంగ్ మార్చ్ కు ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా బృందం బయలుదేరి వెళ్ళింది. ఈ సందర్భంగా కాకినాడ అధ్యక్ష, కార్యదర్శులు పి.వరహాలు, ఎమ్.గంగాసూరిబాబు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మొత్తం నాశనం చేస్తుందని విమర్శించారు. బిజెపి విద్యాను ప్రైవేటీకరణ, కాషాయికరణ, కేంద్రీకరణ చేస్తుందని విమర్శించారు. తక్షణమే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి) 2020, నీట్, సియుఈటిలను తిరస్కరించాలని, భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టం, అందరికీ విద్య, ఉపాధి హామీ, ఫీజుల పెంపును నిరోధించడం, కిండర్ గార్టెన్ నుండి పోస్ట్-గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత, నాణ్యమైన విద్యను అందించడం, విద్య యొక్క వర్గీకరణ-వాణిజ్యీకరణ- కేంద్రీకరణను ప్రతిఘటించడం, విద్యలో ప్రజాస్వామ్య లౌకిక ప్రగతిశీల శాస్త్రీయ స్వభావాన్ని నిలబెట్టడం, విద్యా, ఉద్యోగాలలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన కులాలు, ఇతర అట్టడుగు వర్గాలకు హక్కులు, అవకాశాలను రక్షించడం, సృష్టించడం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడం, రోహిత్ చట్టాన్ని అమలు చేయడం, కులం, ఆర్థిక స్థితి ఆధారంగా వివక్షను ఆపడం, ప్రతి క్యాంపస్‌లో జి ఎస్ సి ఎ ఎస్ హెచ్ ని ఏర్పాటు చేయడం, అన్ని విద్యా సంస్థలలో లైంగిక వేధింపులు, లింగ వివక్ష లేకుండా చేయడం, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని విద్యా సంస్థల్లో కమిటీలను ఏర్పాటు చేయడం, అన్ని క్యాంపస్‌లలో స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలను నిర్వహించడం , విద్యా సంఘం యొక్క ప్రజాస్వామిక హక్కులను నిర్ధారించడం, అగ్నిపథ్ పథకం రోల్ బ్యాక్ తదితర డిమాండ్ ల పై స్టూడెంట్స్ ఇన్ యాక్షన్ 2.0 జయప్రదం చేయాలని కోరారు. ఈ ర్యాలీ కీ జిల్లా నుంచి శ్రీకాంత్, లోవరాజు, అరుణ్, గోపాల్, జయరామ్ , అభిషేక్, జగదీష్, చిన్ని, లోవరాజు, వెంకటేశ్, జాని తదితరులు పాల్గొన్నారు.

➡️