కళారూపాల ప్రదర్శన అభినందనీయం

Apr 6,2024 23:06
ప్రయివేటు విద్యా సంస్థల

ప్రజాశక్తి – పెద్దాపురం

ప్రయివేటు విద్యా సంస్థల విద్యార్థులతో కళారూ పాల ప్రదర్శనలు నిర్వహిం చడం అభినందనీయమని తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఎంఎల్‌సి సురభి వాణిదేవి అన్నారు. శనివారం స్థానిక రామారావుపేటలోని శ్రీ ప్రకాష్‌ సినర్జీ స్కూల్లో కాకినాడ, పెద్దాపురం శ్రీ ప్రకాష్‌ స్కూల్‌ విద్యార్థుల ఆధ్వర్యంలో హరివిల్లు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌సి వాణిదేవి మాట్లాడుతూ ఒక ప్రయివేటు పాఠశాల కళలలకు, వివిధ సంస్కృతులకు ప్రాధాన్యత ఇవ్వడం, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల సంస్కృ తులకు చెందిన కళారూపాలను ప్రదర్శనలు ఇవ్వడం అభినందనీ యమని అన్నారు. మరో ముఖ్య అతిథి గీతా భాస్కర్‌ మాట్లాడుతూ విద్యా ర్థులు రూపొందిం చిన ఈ సాంస్కృతిక కళాఖం డాలు వివిధ సంస్కృ తుల పట్ల అందరిలో అవగాహన పెంచా యన్నారు. ప్రముఖ చంటి పిల్లల డాక్టర్‌ శ్రీరామ గణేష్‌ మాట్లాడుతూ ఇటు వంటి కళలు, కళారూపాల్లో విద్యార్థులను భాగస్వాములను చేయటం వల్ల వారిలో శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. పాఠశాల డైరెక్టర్‌ సిహెచ్‌.విజరుప్రకాష్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల సంస్కృతిలపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

➡️