వైపిపి పాలనలో రాష్ట్రం అంధకారం

Apr 7,2024 23:08
ఐదేళ్ల వైసిపి పాలనతో

ప్రజాశక్తి – కిర్లంపూడి

ఐదేళ్ల వైసిపి పాలనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంధకారంలోకి నెట్టబడిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నా రు. ఆదివారం జడ్‌పి మాజీ ప్రతిపక్షనేత తోట నవీన్‌ స్వగృహంలో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావే శంలో మాట్లాడారు. ఆనాడు ఎన్‌టిఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలనే నేటి వైసిపి అమలు చేస్తుందని అన్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనపై ప్రజలు విసిగివేశారిపోయారని తెలిపారు. దళితులు, బిసిలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో యువత భవిష్యత్‌ను అంధకారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి పాలనలో రూ.2 వేలు పింఛన్‌ ఇచ్చామని, వైసిపి పాలనలో రూ.3 వేలు ఇస్తామని చెప్పి ఐదేళ్ల చివరి కాలంలో రూ.3 వేలకు పెంపుదల చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, పింఛన్‌ను రూ.4 వేలకు పెంపుదల చేయడం జరుగుతుందని వివరించారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శంచారు. యువత భవిష్యత్‌ను నాశనం చేసిన వైసిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం వైసిపి పాలనలో అమలులోకి వచ్చిన వాలంటీర్‌ వ్యవస్థను ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో నిలిపివేయడం జరిగిందని, దీనికి టిడిపికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. త్వరలోనే టిడిపి మేనిఫెస్టోను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకే కూటమిగా బరిలో నిలుస్తున్నట్లు చెప్పారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్‌, చిన్నరాజప్ప, వరుపుల సత్యప్రభ, వనమాడి కొండబాబు, సానా సతీష్‌బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

➡️