మండలాల్లో ప్రజా సమస్యలు పరిష్కరిస్తా: కందుల

ప్రజాశక్తి-పొదిలి: ప్రతి మండలంలోనూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పొదిలి పట్టణంలోని విరాట్‌ నగర్‌ పిచ్చిరెడ్డి తోట సమీపంలో ఏర్పాటు చేసిన కొనకనమిట్ల, పొదిలి మండలాల నాయకులు, కార్యకర్తల విస్తత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తల నుంచి సమస్యలు, విజ్ఞాపనలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలంలో గ్రామాల వారీగా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యనూ పరిష్కరిస్తానని అన్నారు. నా విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని కందుల హామీ ఇచ్చారు. అదేవిధంగా పొదిలి పట్టణంలోని మంచినీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని, వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి పొదిలి మండలాన్ని తీసుకురావాలని పట్టణ నాయకులు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే కార్యాచరణతో మీ ముందుకు వస్తానని కందుల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పట్టణ పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్‌రెడ్డి, ముల్లా ఖుర్దూస్‌, మోరబోయిన బాబూరావు, సీనియర్‌ నాయకులు కాటూరి వెంకట నారాయణ బాబు, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కాటూరి నారాయణ ప్రతాప్‌, కామసాని వెంకటేశ్వరరెడ్డి, శామంతపూడి నాగేశ్వరరావు, తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌కె రసూల్‌, ఎస్‌కె గౌస్‌బాషా, పులి వెంకటేశ్వర రెడ్డి, ఎస్‌ఎం బాషా, రెండు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ‘కందుల’ తనయుడు ఈ సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తనయుడు కందుల విగేష్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి తన తండ్రి గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ పలకరించి కృతజ్ఞతలు తెలిపారు. యువకులు విగేష్‌తో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.

➡️