అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల ఆవిష్కరణ

Jan 27,2024 00:05

పాల్గొన మంత్రి విశ్వరూప్‌, ఎంఎల్‌సి తోట తదితరులు

ప్రజాశక్తి-మండపేట

స్థానిక వాణీమహల్‌ జంక్షన్‌లో రాజ్యాంగం నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలను శుక్రవారం మంత్రి విశ్వరూప్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఛైర్‌పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎంపీ చింతా అనురాధ, ఎంఎల్‌సిలు తోట త్రిమూర్తులు, పండుల రవీంద్ర బాబు, ఇజ్రాయెల్‌, వైసిపి నాయకులు జూపూడి ప్రభాకరరావు, వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, రెడ్డి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలను పట్టణ నడిబొడ్డున ప్రతిష్టించిన ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు ను అభినందించారు. ఈ మహనీయుల చరిత్రను రాబోయే తరాలు తెలుసుకునే విధంగా ప్రతి పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసి వారి ఆశయాలు కొనసాగించేందుకు కషి చేయాలన్నారు. మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలు ఒకే చోటలేవని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు చొరవతో మండపేట నడిబొడ్డున ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు దీనిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి నాయకుడు తమ పరిధిలో విగ్రహాలు ఒకే చోట ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు ను గెలిపించుకొని ఆయన రుణం తీర్చుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పట్టణ వైసిపి కన్వీనర్‌ ముమ్మిడివరపు బాపిరాజు, ఏడిద సర్పంచ్‌ బురిగ ఆశీర్వాదం, పలివెల సుధాకర్‌, వల్లూరి రామకృష్ణ, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

➡️