అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

Mar 13,2024 22:50
అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

ప్రజాశక్తి-అమలాపురంఅల్లవరం మండల పరిధిలో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎంపీ చింతా అనురాధ బుధవారం నిర్వహించారు. ముందుగా కొమరగిరిపట్నం వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌-3లో నరేగా జిజిఎంపి నిధులు రూ.26 లక్షలతో నిర్మించిన భారత నిర్మాణ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. కొమరగిరిపట్నం పంచాయతీ పరిధిలో సిఎస్‌ఆర్‌ నిధులైన 31.50 లక్షలతో నిర్మించనున్న ఒహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. రామేశ్వరంలో మరో ఒహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మాణ పనులకు సిఎస్‌ఆర్‌ నిధులైన రూ.31.50 లక్షలు భూమి పూజ నిర్వహించారు. మొగళ్లమూరులో వైయస్‌ఆర్‌ఎల్‌ క్లినిక్‌లో నరేగా నిధులు జీజీఎంపి నిధులైన రూ.26 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన భారత నిర్మాణ సేవ కేంద్రం ప్రారంభించారు. డి.రావులపాలెంలో ఆర్‌ఎంపి రోడ్డు నుండి బాబా నగర్‌ వరకు రూరల్‌ డెవలప్మెంట్‌ నిధులైన రూ.180 లక్షలతో నిర్మించిన బిటి రోడ్డును ప్రారంభించారు. గుండెపూడి సామంతకుర్రులో నరేగా నిధులు రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. యెంట్రుకోన గ్రామపంచాయతీ పరిధిలో ఉల్లింగి వారి పేట – అరుంధతి కాలనీలో సిఎస్‌ఆర్‌ నిధులు రూ.31.50 లక్షలతో నిర్మించనున్న ఒహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గూడాల గ్రామంలో నందు సరేగా నిధులైన రూ.25 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. కోడూరుపాడు మాకేవారిపేటలో సిఎస్‌ఆర్‌ నిధులైన రూ.31.50 లక్షలతో నిర్మించనున్న ఒహెచ్‌ఎ స్‌ఆర్‌ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల్‌, జెడ్‌పిటిసి కె.గౌతమి, ఎంపిపి ఇళ్ల శేషారావు, ఎఎంసి చైర్మన్‌ డోలామణిరుద్ర, మండల అధ్యక్షుడు కె.బాపూజీ, వైస్‌ ఎంపిపి వడ్డి గంగ, ఎంపిటిసి పి.రాజేశ్వరి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

➡️