ఎన్నికల నిబంధనలు పాటించాలి

Mar 30,2024 16:00

కాలనీ ప్రజలతో మాట్లాడుతున్న పోలీసులు

ప్రజాశక్తి-మండపేట

ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టణ సిఐ అఖిల్‌ జామ, అడిషనల్‌ ఎస్‌ఐ నాంచారయ్యలు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి స్థానిక గాంధీ నగర్‌, సైదులపేట తదితర కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీల ప్రజలతో వారు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని వారు మైక్‌ ద్వారా ప్రచారం నిర్వహించారు. ఓటు వేసే సమయంలో నిర్భయంగా భయం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, రంగారావు, సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️