ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులు కీలకం

Feb 6,2024 17:13

ఇవిఎం, వివిప్యాట్‌ లపై అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, పాల్గొన్న అధికారులు

ప్రజాశక్తి-అమలాపురం

ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులది కీలకపాత్రని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ లో గోదావరి భవన్‌ నందు ఏర్పాటు చేసిన సెక్టార్‌ అధికారులు, పోలీస్‌ సెక్టార్‌ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా సెక్టార్‌ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. రిటర్నింగ్‌ అధికారులకు ఈ సెక్టార్‌ అధికారులు అనుసంధానమై ఉంటారని అన్నారు. ఒక రిటర్నింగ్‌ అధికారి కింద 20 నుంచి 30 సెక్టార్లు ఉంటాయని, ఒక సెక్టార్‌ అధికారికి 10 నుంచి 12 పోలింగ్‌ కేంద్రాల పరిధి ఉంటుందన్నారు. సెక్టార్‌ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్‌ అధికారాలు సంక్రమిస్తాయన్నారు. సెక్టార్‌ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్‌ కేంద్రాన్నీ ఎన్నికల ఆదేశాల మేరకు మూడు సార్లు సందర్శించి వసతులను, ఓటర్లకు అనుకూలతలను పరిశీలించాలని సూచించారు.సెక్టోరల్‌ అధి కారులు సెక్టార్‌ పోలీస్‌ అధికారులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణ సామగ్రి, చేయాల్సిన, చేయకూడని, చెక్‌ లిస్ట్‌, హ్యాండ్‌ బుక్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సెక్టోరల్‌ అధికారుల పాత్ర చాలా ముఖ్యమన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నుంచి ఎన్నికల కోడ్‌, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందన్నారు. తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులు, సెక్టోరల్‌ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికలకు ఓటర్‌ జాబితా, ఇవిఎం, పోలింగ్‌ కేంద్రాలు, పోలింగ్‌ సిబ్బంది కీలకమని జిల్లా కలెక్టర్‌ అన్నారు. ప్రతి ఎన్నికలనూ కొత్తగానే చూడాలని, ఏ దశలోనూ ఎటువంటి తప్పిదాలకూ ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల నిర్వహ ణపై సెక్టార్‌ అధికారులకు అవగాహన కల్పించారు.సెక్టార్‌ అధికారులు, సెక్టార్‌ పోలీస్‌ అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యత యుతంగా నిర్వహించాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, ప్రిసైడింగ్‌ అధికారుల మధ్య అనుసంధాన కర్తలుగా సెక్టార్‌ అధికారులు ముఖ్య భూమిక పోషిస్తారని, పోలింగ్‌ కేంద్రాలు, బూత్‌ స్థాయి అధికారులు, సిబ్బంది, మ్యాపింగ్‌, రూట్లు, ఓటర్లు సంబంధిత ఖచ్చితమైన సమాచారంతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.. పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఎలాంటి విషయమైన నేరుగా జిల్లా ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారులకు మాత్రమే సమాచారం అందించాలని, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల తరలింపు సమయంలో ప్రభుత్వం కేటాయించిన వాహనాలను మాత్రమే వినియోగించాలని తెలిపారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అందించిన ఇవిఎం, వి.వి ప్యాట్‌ మేనేజ్మెంట్‌ ప్రొటోకాల్‌, ప్రిసైడింగ్‌ హ్యాండ్బుక్‌, చెక్లస్ట్‌ ఫర్‌ సెక్టార్‌ ఆఫీసర్‌, మ్యాపింగ్‌ మాన్యువల్‌ తదితర ఎన్నికల నియమావళిని తూ.చా. తప్పకుండా పాటించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అధికారులు బందస్ఫూర్తితో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో నూతనంగా మూడు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్‌ కేంద్రాలలో కనీస వసతులైన వికలాంగుల కొరకు ర్యాంపు, కనీస త్రాగునీటి సౌకర్యం, రన్నింగ్‌ వాటర్‌ తో మరుగుదొడ్డి, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా, లైటింగ్‌, అవసర మైన ఫర్నిచర్‌, ఓటర్లు బారులుగా తీరేందుకు భారికేడింగు, నీడ కొరకు షామ్యానాలు ఏర్పాటు చేయాలని, హెల్ప్‌ డెస్క్‌ వద్ద విఆర్‌ఓ నియమించాలని పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఎటువంటి పార్టీ కార్యాలయం ఉండకుండా చూసుకోవాలన్నారు. జిల్లా ఎస్‌పి ఎస్‌.శ్రీధర్‌ మా ట్లాడుతూ క్రిటికల్‌ వనర్బులిటీ మ్యాపింగ్‌, అధికారులు చక్కటి ప్రణాళిక సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు ఓటు వేయడానికి వెళ్లే ఓటర్లను ఇబ్బంది పెట్టే వారి సమాచారాన్ని తమ దష్టికి తెస్తే తగు చర్యలు తీసుకుని నిష్పక్షపా తంగా ఓటింగ్‌ జరిగేందుకు సహకరిస్తామన్నారు. అధికారులకు ఏవైనా సందేహాలు ఉంటే ఎప్పటికప్పుడు తమ దష్టికి తెచ్చి నివత్తి చేసుకో వాలన్నారు.కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబు 7 నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్‌ అధికారులు సెక్టార్‌ అధికారులు,పోలీస్‌ సెక్టార్‌ అధికారులు, పాల్గొన్నారు.

 

➡️