గ్రామాల అభివృద్ధి వైసిపి ప్రభుత్వం కృషి

Feb 18,2024 22:41

మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి చెక్కు అందజేసిన చేస్తున్న ఎంఎల్‌సి తోట

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం

గ్రామాల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. వడ్లమూరు లో నూతనంగా నిర్మించిన వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రం, బిసి సామాజిక భవనం, రజక సామాజిక భవనాలను ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భ:ంగా నిడసనమెట్ట , వడ్లమూరు గ్రామాల్లో డ్వాక్రా మహిళలకు నిర్వహించిన నాల్గవ విడత ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని డ్వాక్రా గ్రూపుల లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్‌ చుండ్రు మంగాయమ్మ చిట్టిబాబు అద్యక్షతన జరిగిన సమావేశంలో ఎంఎల్‌సి తోట పాల్గొని మాట్లాడారు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు ఇప్పటి వరకు నాలుగు విడతలుగా ఆసరా నిధులు మంజూరు చేసి మహిళల పక్షపాతిగా మన్ననలు పొందారని తోట కొనియాడారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ మరో వైపు పేదరిక నిర్మూలనకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక సిఎం జగన్‌ అని పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి చెక్కు అందజేతఅనంతరం వాకతిప్ప జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో తేలు కుట్టి మృతి చెందిన కోరుమిల్లి గ్రామానికి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును తోట త్రిమూర్తులు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి, దుర్గారావు, జెడ్‌పిటిసి సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్‌ చుండ్రు మంగాయమ్మ, చుండ్రు చిట్టిబాబు, ఎంపిటిసి సభ్యుడు పలివెల మధు, ఎపిఎం గోలి దుర్గా ప్రసాద్‌, డ్వాక్రా యానిమేటర్లు ,వైసిపి నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.

 

➡️