ఘనంగా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు

Jan 23,2024 23:02

అంబాజీపేటలో జరిగిన వేడుకల్లో టిడిపి, జనసేన శ్రేణులు

ప్రజాశక్తి-యంత్రాంగం

అంబాజీపేట నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు అంబాజీపేట లో మంగళవారం మండల టిడిపి, జనసేన నాయకులు ఆధ్వర్యంలో పోలీస్టేషన్‌ ఎదురుగా ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కేకు కట్‌ చేసి అభిమానులకు పార్టీ శ్రేణులకు పంచారు. కార్యక్రమంలో నామన రాంబాబు, డొక్కానాథ్‌ బాబు,మండల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు డిశ్రీనురాజు, గూడాల ఫణి, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.వెంకటేశ్వరరావు, డి.సాయికష్ణ, డివివి.సత్యనారాయణ, గణపతి వీర రాఘవులు,అరిగెల బలరామూర్తి, గంగుమళ్ళ వీరభద్రరావు,పి.గన్నవరం సర్పంచ్‌ బొండాడ నాగమణి తదితరులు పాల్గొన్నారు. మండపేట నారా లోకేష్‌ పుట్టినరోజు సందర్బంగా స్థానిక టిడిపి కార్యాలయంలో ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబులు కేకు కట్‌ చేసి అభిమానులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. మామిడికుదురు పి.గన్నవరం నియోజకవర్గం నాయకులు నగరం గ్రామశాఖ అధ్యక్షులు జాలెం సుబ్బారావులి అధ్యక్షతన నగరం లో ఇంటివద్ద కేక్‌ కట్‌ చేసి లోకేష్‌కు శుభాకాంక్షలు తెలియజేసారు తదనంతరం నగరం పిహెచ్‌సి నందు పండ్లు పంచిపెట్టి, మొగలికుదురు అనాదాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరం సర్పంచ్‌ జాలెం రమణ కుమారి , జాలెం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా మెయిన్‌ రోడ్‌ లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకు కట్‌ చేసి స్వీట్స్‌, పండ్లు, కేకు పేదలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వంటిపల్లి సతీష్‌ కుమార్‌, ఈదల నల్లబాబు, రామానుజునుల శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం(అల్లవరం) అల్లవరం మండలం కోడూరుపాడు టిడిపి కార్యాలయం వద్ద నారా లోకేష్‌ పుట్టినరోజును పురస్కరించుకుని అల్లవరం మండల టిడిపి అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబు రాజు మరియు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గొలకోటి చిన్నా ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. టిడిపి అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్‌ అయితాబత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️