చిరుధాన్యాల్లో అధిక షోషకాలు

Mar 17,2024 00:23

మాట్లాడుతున్న సూపర్‌వైజర్‌ వరలక్ష్మి

ప్రజాశక్తి – ఆలమూరు

చిరుధాన్యాల్లో అధిక పోషక లాభాలు ఉన్నందున వాటిని తప్పక వినియోగించాలని చెముడులంక సెక్టార్‌ ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ వరలక్ష్మి అంగన్‌వాడీలకు సూచించారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక దష్టి సారించాలని ఆమె అంగన్‌వాడీలను ఆదేశించారు. మండలంలోని మడికి అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమానికి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాలను ఉపయోగించే విధానం, ఉత్తమ పోషకారం, పరిశుభ్రత గురించి ఏ వివరించారు. అదేవిధంగా బాల్య వివాహాల వలన కలిగే అనర్థాల గురించి వరించారు. చిరు ధాన్యాలతో వండిన ఆహారం పదార్ధాలతో అంగన్‌వాడీల వద్ద ఏర్పాటు చేసినా స్టాల్స్‌లో చిరుధాన్యాల ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో కె.మెర్సీ ఫ్లోరెన్సీ, సిహెచ్‌.భాను కుమారి, పి.సత్యవతి, పి.రమణ, సిహెచ్‌.మంగతాయారు, పలువురు అంగన్వాడి కార్యకర్తలు, పాల్గొన్నారు.

 

➡️