టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Mar 15,2024 22:18

ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-కొత్తపేట

మండలంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంఇఒ ఎం.హరి ప్రసాద్‌ తెలిపారు. మండలంలో 940 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, 111 మంది ప్రయివేటు విద్యార్థులు మొత్తం 1051 మంది పరిక్షలకు హాజరవుతారన్నారు. కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 230 మంది, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో 240, జెడ్‌పి బాలికోన్నత పాఠశాల్లో 229, జెడ్‌పిఉన్నత పాఠశాల చప్పిడివారిపాలెంలో 157, జెడ్‌పి ఉన్నత పాఠశాల వాన పల్లిలో 155 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని వివరిం చారు. మార్చి 18 నుంచి మార్చి 27 వరకు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు 8.30 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవా లని, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు హాల్‌ టిక్కెట్‌ చూపి ించి ఉచిత బస్సు సౌకర్యము వినియోగించుకోవచ్చు అన్నారు.

 

➡️