ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి

Mar 20,2024 16:48

అవగాహనా ర్యాలీని ప్రారంభిస్తున్న ఆర్‌డిఒ

ప్రజాశక్తి-అమలాపురం

18 సంవత్సరాల నిండిన యువత ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై, ప్రజాస్వామ్యాన్ని బలో పేతం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని స్థానిక రెవెన్యూ డివిజనల్‌ అధికారి, రిటర్నింగ్‌ అధికారి జి కేశవర్ధన్‌ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. బుధవారం భారత ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు క్రమబద్ధమైన ఓటర్ల విద్య ఎన్నికల భాగస్వామ్యం (స్వీప్‌) పేరిట నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఓటు విలువైనది అనే అంశంపై స్థానిక జిఎంసి బాలయోగి స్టేడియం నందు అవగాహనా ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఓటు యొక్క ఆవశ్యకత నినాదాలతో రూపొందించిన పతంగుల పండగలో పాల్గొని పతంగు లను ఎగరవేశారు. ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకొనే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఓటర్లకు అవగాహన కార్యకలాపాలు నైతిక ఓటింగ్‌ గురించి ఓటర్లకు హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యాల గురించి అవగాహన పెంపొందిస్తారన్నారు మొదటిసారి ఓటర్లు, థర్డ్‌ జెండర్‌, సర్వీస్‌ ఓటర్లు, సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులు, హోమ్‌ ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌పై అవగాహన పెంపొంది స్తారన్నారు. ప్రతి ఓటు క్రియాశీల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుం దన్నారు. ఈ పోటీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు ప్రాముఖ్యతను సంతరించు కుంటుందనే దిశగా స్వీప్‌ కార్యక్రమం రూపొందించబడిందన్నారు. కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్‌ ఎపిడిి మధుసూదన్‌, జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ పథక సంచాలకులు వి.శివశంకర్‌ ప్రసాద్‌, ఆర్‌డిఒ కార్యాలయం సిబ్బంది ఆదిత్య, విద్యా నిధి, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

 

➡️