ముమ్మరంగా వరి కోతలు

Mar 29,2024 23:27

కోత కోస్తున్న వరి కోత యంత్రం

ప్రజాశక్తి-మండపేట

మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. మండపేట మండలంలో ఈ రబీ సీజన్‌ కు సంబంధించి 16191 ఎకరాల్లో ఎంటియు 1121 (సన్నాలు) ఎంటియు 3626 (బొండాలు) 4259 ఎకరాల్లో రైతులు వరిని పండిస్తున్నారు. 63,446 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఎంటియు 1121 రకం 47,155 మెట్రిక్‌ టన్నులు ఎంటియు 3626 రకం 16,290 మెట్రిక్‌ టన్నులు. మండపేట పట్టణంలో ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో 23 ఆర్‌బికెలు, 6 సొసైటీలు ఉన్నాయి. అన్నింటిలోను ధాన్యం కొనుగోలుకు అధికారులు సిద్ధం చేశారు.

 

➡️