మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత

Feb 26,2024 22:48
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మండల పరిధిలోని చిందాడగరువులో రూ.రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. జనతా కాలనీలో రూ.18 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. కామనగరువులో పంచాయతీ నిధులు రూ.25 లక్షలతో చిట్టెమ్మ చెరువులో నిర్మించిన సిసి రోడ్లను మంత్రి ప్రారంభించారు. జాతీయ రహదారులు గడప గడపకు మన ప్రభుత్వం నిధులైన రూ.35 లక్షలతో కామనగరువు చిట్టెమ్మ చెరువులో నిర్మించిన మండల పరిషత్‌ పాఠశాల, అంగన్‌వాడీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రూ.కోటి వ్యయంతో కామనగరువు ఆర్‌ అండ్‌ బి రోడ్‌ నుండి పసిడి చెరువు వరకు నిర్మించిన బిటి రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో అమలు చేస్తూ గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడుతోందన్నారు. ప్రజా సంక్షేమానికి అండగా భరోసాగా నిలుస్తోందన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా నూతన సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైన మార్పులు విద్య వైద్య రంగాల్లో తీసుకుని రావడంతో పాటు క్షేత్రస్థాయిలో చక్కని గ్రామ సచివాలయ పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసి ఇంటి ముంగిటే సంక్షేమ ఫలాలు వైద్య సేవలు అందిస్తూ ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అనంతరం స్కూల స్థల దాత గిడ్డి గనికమ్మను మంత్రి విశ్వరూప్‌ ఘనంగా సత్కరించారు. సర్పంచులు నక్కా అరుణ కుమారి, పి.గణేష్‌, ఎఎంసి చైర్మన్‌ దంగేటి డోలమణి రుద్ర, జెడ్‌పిటిసి పందిరి శ్రీహరి రామ్‌ గోపాల్‌, పంచాయతీరాజ్‌ ఇఇ పిఎస్‌.రాజకుమార్‌, మండల అధ్యక్షుడు బొంతు గోవిందశెట్టి పాల్గొన్నారు.

➡️