రైతుల పోరాటానికి సిపిఎం మద్దతు

Feb 24,2024 19:03

అమలాపురం లో సిపిఎం, సిఐటియు నాయకుల నిరసన

ప్రజాశక్తి-అమలాపురం

సిపిఎం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌కోనసీమ జిల్లా కమిటీ అధ్వర్యంలో అమలాపురంలో శనివారం ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీ సరిహద్దులో కనీస మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసుల దాడిలో శుభకరణ్‌ సింగ్‌ మరణించడం పట్ల డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సిపిఎం కమిటీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిందిఈ సందర్బంగా సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతు సమస్యలను పరిష్కరించలేని కేంద్ర బిజెపి ప్రభుత్వం దీక్ష చేస్తున్న రైతును చంపడం దుర్మార్గమని దీనిని ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలని పిలుపు నిచ్చారు. రైతులు చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడి కార్పొరేట్లకు రెడ్‌ కార్ప్ఱెట్లు పరుస్తూ రైతులపై ముళ్ల బులెట్లు కురిపిస్తున్న వైఖరిని ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శులు కె.కష్ణవేణి, జి.దుర్గా ప్రసాద్‌ మాట్లాడపతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా మోసగిస్తోందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు గనులు విద్యుత్‌, అటవీ సంపదలను, రవాణా, బ్యాంకులు, ఎల్‌ ఐసి తదితర సంస్థలన్నిటిని అదానీ, అంబానీ తదితర కార్పొరేట్‌ కంపెనీలకు అప్పచెప్ప చూస్తోందని అన్నారు. కార్పొరేట్‌ కంపెనీల లాభాలకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక కోడ్లు తెచ్చిందన్నారు. మోడి కార్పొరేట్లకు రెడ్‌ కార్ప్ఱెట్లు పరుస్తూ రైతాంగంపై ముళ్ళ బులెట్లు కురిపిస్తున్న వైఖరిని ఖండించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఉద్యమానికి తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసిన మరొక రూపంలో వాటిని అమలు చేయాలని చూస్తోందన్నారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ముందు పెట్టిందని కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం సామాన్య ప్రజల నిత్యవసర వస్తువులన్నింటిపైన జిఎస్‌టి పేరుతో పన్నులు పెంచిందన్నారు. గత పదేళ్లలోబిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అదాని, అంబానీలు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరగా పేద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఒక లక్షా యాభైవేల మంది బలవన్మరణం పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భాస్కర్‌ రావు, విప్పర్తి మోహన్‌ రావు, సబ్బతి రాంబాబు, లక్ష్మణరావు, డి.సత్యనారాయణ, బుంగ సత్యనారాయణ, టి.సత్య నారాయణ, ఎస్‌.మేరీ తదితరులు పాల్గొన్నారు.

 

➡️