వాలంటీర్ల సేవలు అమూల్యమైనవి

Feb 21,2024 18:47

అంబాజీపేట లో వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేస్తున్న పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు, నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్‌ విప్పర్తి వేణుగోపాలరావు

ప్రజాశక్తి – అంబాజీపేట

కరోనా కష్టకాలంలో సైతం వాలంటీర్లు అందించిన సేవలు అమూల్యమైనవని పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు అన్నారు. అంబాజీపేట మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన వాలంటీర్లకు వందనం కార్యక్రమం నకు ఎంఎల్‌ఎ, జెడ్‌పి ఛైౖర్మన్‌, వైసిపి ఇన్‌చార్జ్జి విప్పర్తి వేణుగోపాలరావు ముఖ్య అతిథిలుగా విచ్చేశారు. అత్యంత సేవలు అందించిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర, అవార్డులు అందించి వారిని శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ మీ సేవలు మరో అయిదేళ్లు కొనసాగేలా సిఎం జగన్‌ను వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలిపించే దిశగా jఔషి చేయాలన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తున్న వాలంటీర్ల సేవలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అభినందిస్తున్నాయని ఇన్‌ చార్జ్‌ విప్పర్తి వేణుగోపాలరావు హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యురాలు బూడిద వరలక్ష్మి, వైస్‌ ఎంపిపిలు ఎన్‌.నాగరాజు, ఎస్‌.లక్ష్మీభార్గవి రాము, ఎంపిటిసి సమాఖ్య ప్రశాంత్‌, సొసైటీ ఛైర్‌పర్సన్‌ దొమ్మెటి సత్యమోహన్‌, సర్పంచ్‌లు నాగాబత్తుల శాంతాకుమారి కోట బేబీరాణి, కె.కోటబాబు, మండల అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్‌, కడలి సుబ్రహ్మణ్యం, మద్దింశెట్టి మల్లిబాబు, యు.నాగబాబు, ఎంపిటిసి సభ్యులు, ఇన్‌చార్జ్‌ ఎంపిడిఒ బి.మమత, అధికారులు, కార్యదర్శులు, నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

అంబాజీపేట లో వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేస్తున్న పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు, నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్‌ విప్పర్తి వేణుగోపారావు

➡️