‘విశ్వకర్మ యోజన’తో ఆర్థిక భద్రత

Feb 20,2024 23:01

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ

ప్రజాశక్తి-అమలాపురం

చేతివత్తులు, కులవత్తుల వారికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్‌ నందు కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల వారి ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమల కేంద్రం సౌజన్యంతో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన సెమినార్‌ అవగాహన సదస్సు కులవత్తుల వారు డ్వాక్రా సంఘాల సభ్యులతో నిర్వహించారు. డిఆర్‌ఒ మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా దోబి, నాయీ బ్రహ్మణ, కుమ్మరి, శిల్పులు, స్వర్ణకారులు, వడ్డెర, మేర, మేదరి, ఉప్పరి, మోచి మొదలైప చేతి వృత్తుల వారికి సహ కారాన్ని అందిస్తామని తెలిపారు. అర్హులకు సర్టిఫికెట్‌, ఐడీ కార్డు, పారిశ్రామిక పనిముట్లు, ట్రైనింగ్‌ టూల్‌ కిట్‌ కొనుగోలుకు రూ.15 వేల సాయాన్ని అందిస్తారన్నారు. ఐదు శాతం వడ్డీకే రూ.3 లక్షల ఎంటర్ప్రైజెస్‌ డెవలప్మెంట్‌ రుణాలు రెండు విడతలుగా అందజేస్తా రని తెలిపారు. డిజిటల్‌ లావాదేవీ లపై ప్రతినెల రూ.100 ట్రాన్సా క్షన్కు రూపాయి చొప్పున ఇన్సెంట్‌ లభిస్తుందని చెప్పారు. కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా ఆధార్‌, మొబైల్‌ నంబర్‌, బ్యాంకు వివరాలను సమర్పించి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రిజి స్ట్రేషన్‌ చార్జీలను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ పికెపి ప్రసాద్‌, డిఆర్‌డిఎ పీడీ శివశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి వి.కృష్ణకుమారి, జిల్లా లీడ్‌ పాయింట్‌ మేనేజర్‌ కె.శ్యాంబా బు, స్థానిక పురపాలక సంఘ కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌, ఎంఎస్‌ఎంఇ డిప్యూటీ డైరెక్టర్‌ చంద్రమౌళి, సహాయ సంచాలకులు చంద్రమౌళి కుల , చేతి వృత్తిదారులు పాల్గొన్నారు.

 

➡️