Protem Speakerగా కాంగ్రెస్‌ ఎంపి కె. సురేష్‌ .. !

న్యూఢిల్లీ : 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈ నెల 24 నుండి ప్రారంభం కానున్నాయి. 26న లోక్‌సభ కొత్త స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. అప్పటి వరకు ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత కె. సురేష్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. కేరళలోని మవెలికర ఎంపి అయిన కె.సురేష్‌… దీర్ఘకాలం పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అనంతరం ప్రధాని మంత్రి మండలి, ఇతర ఎంపిలతో ఆయన ప్రమాణం చేయించనున్నారు.

➡️