వైసిపి విజయానికి కృషి చేయాలి

Mar 24,2024 17:10

మేము సిద్ధం కార్యక్రమంలో పట్టాభి తదితరులు

ప్రజాశక్తి-మండపేట

వైసిపి విజయం కోసం అందరూ కృషి చేయాలని జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, వైసిపి నాయకులు రెడ్డి రాజబాబులు అన్నారు. పట్టణంలో 21, 22 వార్డుల కార్యకర్తల సమావేశంలో సచివాలయ కన్వీనర్లు, గహసారథులు, బూత్‌ఇన్‌ ఛార్జిలు, కార్యకర్తలకు ఎన్నికల నిర్వహణపై సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సిఎం వైఎస్‌ జగన్‌ విద్య, వైద్యానికి పెద్దపీట వేసారన్నారు. విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం విద్యతో పాటు అమ్మబడి, విద్యాకానుక, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్‌ వంటే పథకాలు అమలు చేసి విద్యాభివద్ధికి పాటు పడ్డారన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారన్నారు. ప్రతిపక్ష టిడిపి అభివృద్ధి జరగలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. అనంతరం మేము సిద్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్‌ కన్వీనర్‌ యరమాటి వెంకన్నబాబు, శెట్టి నాగేశ్వరరావు, సాధనాల శివ భగవాన్‌, షేక్‌ నాగూర్‌, అలమండ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

➡️