రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలైన సంఘటన పట్టణంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పైన సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు … చీరాల ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న ఓ యువకుడు బైక్‌ పై ప్రయాణిస్తూ రైల్వే బ్రిడ్జి రోడ్డుపైన బైక్‌ అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢకొీన్నాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంకు సమాచారం అందించారు. దీంతో చికిత్స నిమిత్తం ఆ యువకుడిని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రమాదానికి గురైన యువకుడికి సంబంధించిన బంధువులు ఎవరు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో బైక్‌ను నడపడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పేరు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఆరా తీస్తున్నారు.

➡️