వైసిపి శ్రేణులు ఐకమత్యంతో చేయాలి

Mar 22,2024 16:23

కరవాక లో పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న గొల్లపల్లి

ప్రజాశక్తి- మామిడికుదురు

రాజోలు నియోజక వర్గంలో పార్టీ శ్రేణులు,కార్యకర్తలు అంతా ఐకమత్యంతోపని చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. శుక్రవారం కరవాక లో పార్టీ శ్రేణలతో సమావేశంఅయ్యారు గొల్లపల్లి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ల సీఎం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ప్రతి పక్షాల విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వాలని సూచించారు. తాను పార్టీలకి అతీతంగా అనేక అభివద్ది పనులు చేశానని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సత్యనారాయణ, ఎంపిటిసి సభ్యుడు మల్లాడి వడ్డి కాసులు బొలి సెట్టి భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️