‘ సేవా మిత్ర’లకు అభినందన సభ

Mar 1,2024 16:39

సర్పంచ్‌ సతీష్‌ కుమారి ఆధ్వర్యంలో సిఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం

ప్రజాశక్తి-రామచంద్రపురంగ్రామాల్లో సేవలందిస్తున్న సేవా మిత్రులకు ప్రభుత్వం నగదు పురస్కారాలు అందిస్తూ ప్రోత్సహిస్తుందని ప్రతిభ కనబరిచిన వారు సేవా మిత్ర అవార్డులు గెలుచుకోవడం సంతోషదాయకమని వెంకటాయ పాలెం సర్పంచ్‌ యల్లమెల్లి సతీష్‌ కుమారి అన్నారు. సిఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయం వ్యవస్థలో వివిధ సేవలందిస్తున్న గ్రామ వాలంటీర్ల ను ఆమె అభినందించారు. అవార్డు ద్వారా రూ.15 వే నగదు జమ చేసినందుకు గ్రామపంచాయతీ వద్ద జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి ఎపి ఐడిసి డైరెక్టర్‌ వాసంశెట్టి శ్యామ్‌, ఉప సర్పంచ్‌ గంధం బుజ్జి, సచివాలయం కన్వీనర్‌ దడాల రవికుమార్‌, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

➡️