స్ట్రాంగ్‌ రూములను పరిశీలించిన ఆర్‌డిఒ

Mar 1,2024 16:38

స్ట్రాంగ్‌ రూములను పరిశీలిస్తున్న ఆర్‌డిఒ సుధాసాగర్‌

ప్రజాశక్తి-రామచంద్రపురం

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూములను రెవెన్యూ డివిజనల్‌ అధికారి సుధాసాగర్‌ శుక్రవారం పరిశీలించారు. నియోజక వర్గ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పట్టణంలోని వి ఎస్‌ ఎం కళాశాల లో ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌ లు , పరిసర ప్రాంతాల భద్రతను ఆయన పర్యవేక్షించారు.   ఎక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన పోలీసులకు సూచించారు. ఆయన వెంట తహశీల్దార్‌ ఎం.వెంకటేశ్వరరావు, రామచంద్రపురం సి ఐ పి.దొరరాజు, ఎస్‌ఐ సురేష్‌ బాబు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️