మానవ హక్కుల దిక్సూచి అంబేద్కర్

Apr 14,2024 22:12
మానవ హక్కుల దిక్సూచి అంబేద్కర్

ప్రజాశక్తి-యంత్రాంగం భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ మానవ హక్కుల దిక్సూచి అని పలువురు కొనియాడారు. ఆదివారం అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా వాడవాడలా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అమలాపురం పట్టణంలోని మద్దాలవారి పేటలో అంబేద్కర్‌ విగ్రహానికి మంత్రి పినిపే విశ్వరూప్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ నాగారపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్ర మణి, వైస్‌ చైర్మన్‌ రుద్రరాజు నానీరాజు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, వైసిపి పట్టణ అధ్యక్షుడు సంసాని బుల్లి నాని, మున్సిపల్‌ కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్‌, దొమ్మేటి రాము, కొల్లాటి దుర్గాబాయి, మంగళంపల్లి అంజిబాబు, కల్వకొలను ఉమ, తోరం గౌతమ్‌, అనంత్‌, యల్లమిల్లి రాజు, దొమ్మేటి రాము తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్‌ ప్రాంగణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పుష్ప గుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా, భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, విశ్వ వ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు. దేశ రాజ్యాంగ రచనా సమయంలో పౌరులందరి సామాజిక, రాజకీయ సమానత్వం పట్ల విస్తతమైన ఆమోదానికి ఆయన వీలు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.దుర్గారావు దొర, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికార అధికారి పి.జ్యోతిలక్ష్మి దేవి, కలెక్టరేట్‌ ఎఒ సిహెచ్‌.వీరాంజనేయ ప్రసాద్‌, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ పి.సుబ్రహ్మణ్యం కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.కపిలేశ్వరపురం కాలేరు దళితవాడలోని అంబేద్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో మత్తాల మధుసూదన రావు అధ్యక్షతన నిర్వహించిన జయంతిలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మాదే ప్రసాదరావు మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాల్లో అంబేద్కర్‌ 1జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిడిఒలు, ఎంపిటిసిలు మండల పరిషత్‌ సిబ్బంది అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ లర్పించారు. పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్‌ సాకా శ్రీనివాస్‌ నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్‌ దాయం కావేరి శేఖర్‌ బాబు, పెయ్యల యాకోబు, నాతి చంద్రశేఖర్‌, బక్కి సతీష్‌, నాతి సురేష్‌, బక్కి వీర్రాజు పాల్గొన్నారు. ఆలమూరు అంబేద్కర్‌ సంస్కరణలకు ఆద్యుడని స్థానిక న్యాయవాదులు కొనియాడారు. ఆలమూరు బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సలాది సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు ఘనంగా నివాళుర్పించారు. మండలంలో పలుచోట్ల దళిత సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులతో కలిసి ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుణ్ణం వీరవెంకట సత్యనారాయణ మూర్తి, కెఎం.కృష్ణబాబు, కె.ధనరాజు, సంఘ జాయింట్‌ సెక్రెటరీ, కె.రాజశేఖర్‌, లాయర్లు వి.నవీన్‌ కుమార్‌, బూల మహాలక్ష్మి, వేమగిరి నరసింహమూర్తి, కె.ప్రసన్న, చల్లా సతీష్‌ పాల్గొన్నారు.ఆత్రేయపురం మెర్లపాలెంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో గ్రామ సర్పంచ్‌ మెర్ల రాముతో పాటు పలువురు అంబేద్కర్‌ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్‌ కట్‌ చేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు.మండపేట స్థానిక మారేడుబాక రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టికెవి.శ్రీనివాసరావు విద్యార్థులతో కలిసి అంబేద్కర్‌ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, సిబ్బంది పాల్గొన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి నాయకులతో కలిసి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు బి.కొండ, కె.నరేంద్ర, వి.నాగేంద్రప్రసాద్‌, ఐ.వెంకటఅప్పారావు, ఆర్‌.రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పనపాడు గ్రామంలో అంబేద్కర్‌ యువజన యూత్‌ ఆధ్వర్యంలో 1500 వందల మందికి అన్నదానం నిర్వహించారు. రూరల్‌ ఎస్‌ఐ చైతన్య కుమార్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు మగ్గం రాంబాబు, యువ నాయకులు సాంబత్తుల జయబాబు, వీరుల జీవ, పశ్చిమ గంగరాజు, అంజనీకాంత్‌ కుమార్‌, సాంబత్తులు రాజు, తొండ సత్తిబాబు, మగ్గం నాని, గుంటూరు అప్పన్న, కొల్లపు గంగరాజు, నేతల సత్తిబాబు పాల్గొన్నారు.అల్లవరం కోడూరుపాడులో మంత్రి పినిపే విశ్వరూప్‌, మొగళ్లమూరు, శిరగట్లపల్లిలో ఎంపీ చింతా అనురాధ, కోమరిగిపట్నం, గోడి గ్రామంలోని అంబేద్కర్‌ నగర్‌, బొమ్మి వారి పేటలో ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అమలాపురం రూరల్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ఉద్యమించాల్సిన సందర్భం దేశంలో నేడు నెలకొందని ఎపి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌ అన్నారు. ఈదరపల్లిలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కామన ప్రభాకర్‌ రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో గౌతమ్‌ మాట్లాడారు. బిజెపి మూల సిద్ధాంతం భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని కనుకనే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ నాయకులు పదేపదే చెబుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి ప్రధాన కార్యదర్శులు మహమ్మద్‌ ఆరిఫ్‌, మాచవరం శివన్నారాయణ, ఎఐసిసి సభ్యులు యార్లగడ్డ రవీంద్ర, వడ్డి నాగేశ్వరరావు, రాయుడు గంగాభవాని, కుడిపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.బండారులంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్‌ పెనుమాల సునీత ఏడుకొండలు అధ్యక్షతన అంబేద్కర్‌ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు చింత శంకర్‌మూర్తి, పిచ్చిక శ్యామ్‌, బొక్కా పార్థసారథి, మాడా మాధవి, బొట్టు పండు, పంచాయతీ కార్యదర్శి సూపర్‌ రాజు, గ్రామ పెద్దలు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.రామచంద్రపురం వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్‌ ద్రాక్షారామ సెంటర్‌లోని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి అబ్జర్వర్‌ శ్రీనివాస రాజు, పోలినాటి ప్రసాద్‌, దళిత సంఘం నాయకులు రేవు నాగేశ్వరరావు, సిహెచ్‌.దేవానందం, గుబ్బల శ్రీనివాసరావు, చల్లపూడి పట్టాభి, ఉపాధ్యాయ సంఘం నాయకులు చొప్పెల్ల వెంకన్న బాబు, కనికెళ్ల కృష్ణ పాల్గొన్నారు.మామిడికుదురు వైసిపి పి.గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్‌ పాశర్లపూడి కొండాలమ్మ చింత సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేచి నివాళ లర్పించారు. మామిడికుదురు సెంటర్‌లో కాంగ్రెస్‌ నాయకులు అప్పనశ్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో గెడ్డం వెంకటేశ్వరరావు, నీతిపూడి బాల సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లూటుకుర్రులో సర్పంచ్‌ అడబాల తాతకాపు, మామిడికుదురులో సర్పంచ్‌ గౌస్‌ మొహిద్దీన్‌, పాశర్లపూడిలో సర్పంచ్‌ కొనుకు ప్రేమ జ్యోతి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేచి నివాళులరపించారు.ఉప్పలగుప్తం మండలంలోని ఆయా గ్రామాల్లో అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలయోగి పార్కులోని అంబేద్కర్‌ విగ్రహానికి జెడ్‌పిటిసి గెడ్డం సంపదరావు సర్పంచుల సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ బోర్డు సభ్యుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, వైసిపి మండల కార్యదర్శి పినిపే జయరాజు, ఎఎంసి డైరెక్టర్‌ చప్పిడి దుర్గారావు, పోతుమూడి కొండబాబు, పెయ్యల రమణ, యనమదల పల్లంరాజు పాల్గొన్నారు.ముమ్మిడివరం రాజ్యాంగ నిర్మాత డా.అంబేడ్కర్‌ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం అని ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్‌ జి.వెంకట రామి రెడ్డి అన్నారు. నగర పంచాయతీ కార్యాలయంలో కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పెట్టా శివ ప్రసాద్‌ అధ్యక్షతన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి కమిషనర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలు, మహిళలకు, కార్మికులకు ఎన్నో హక్కులను కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ బొజ్జా రమణశ్రీ, కాశి వెంకటాచారి, జనిపల్లి బాలకృష్ణ, పి.డేనియల్‌, వి.బాబారు, కె.రాము, ఎన్‌.శ్రీను, లక్ష్మణరావు పాల్గొన్నారు.

➡️