Deputy CM: పవన్‌కల్యాణ్‌కు ఛాంబర్‌ రెడీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌కు సచివాలయంలో ఛాంబర్‌ రెడీ అయ్యింది. ఆయనకు రెండో బ్లాక్‌ మొదటి అంతస్తు 212 గదిని ప్రభుత్వం కేటాయించింది. అదే అంతస్తులో జనసేనకు చెందిన పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు, సినిమాటోగ్రఫీ, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు కూడా ఛాంబర్లు కేటాయించారు. ఈ నెల 19న పవన్‌కల్యాణ్‌ డిప్యూటీ సిఎంగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే.

➡️